‘త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల’

23 Sep, 2023 18:39 IST|Sakshi

సాక్షి,  ఢిల్లీ: కాంగ్రెస్‌లో చేరే వారికి ఎలాంటి అడ్డంకులు లేవని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలనుకుంటున్నారని, సోనియా గాంధీ వల్లే తెలంగాణ ఏర్పండిదనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు.శనివారం కాంగ్రెస్‌లో చేరేందుకు భారీగా నకిరికేల్‌ నుంచి ఢిల్లీకి వెళ్లారు. వారిని మాణిక్‌ రావ్‌ ఠాక్రే ఆధ్వర్వంలో తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కండువాల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

అనంతరం మాణిక్‌ రావ్‌ ఠాక్రే మాట్లాడుతూ..  ‘తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలనుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌తో తమకు రక్షణ లేదని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ రావడంతో పాటు హైదరాబాద్‌ తెలంగాణకు రావడానికి సోనియాగాంధీనే కారణమని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. అందర్నీ కలుపుకుని వెళ్లాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.

తొలి విడత అభ్యర్థుల జాబితా త్వరలో విడుదల అవుతుంది. సీఈసీ తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత రెండో విడత జాబితా విడుదల అవుతుంది. ఓబీసీలు కాంగ్రెస్‌తో ఉన్నారు. రాష్ట్రంలోనే చేరికలు ఉంటాయి.. హైకమాండ్ ను  కలవడానికి ఢిల్లీ వస్తున్నారు. ‍కాంగ్రెస్‌ చేరడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. 50 శాతానికి పైగా సీట్లు తొలి విడత లిస్ట్‌లోనే ఉంటాయి. త్వరలోనే కాంగ్రెస్‌ అభ్యర్థుల మొదటి విడత జాబితాను విడుదల చేస్తాం’ అని మాణిక్‌ రావ్‌ ఠాక్రే తెలిపారు.

మరిన్ని వార్తలు