ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంది: ప్రధాని మోదీ

24 Feb, 2023 13:03 IST|Sakshi

కోహిమా: ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుందని తీవ్ర విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాగలాండ్‌లోని ఛుమౌకేదిమా జిల్లాలో ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్‌తో నడిపించేవారని ధ్వజమెత్తారు. 

కాంగ్రెస్‌ హయాంలో నాగలాండ్‌లో అస్థిరత్వం ఉండేదని మోదీ అన్నారు. అభివృద్ధిని పట్టించుకోకుండా వారసత్వ రాజకీయాలకే ఆ పార్టీ ప్రాధాన్యం ఇచ్చేదని విమర్శలు గుప్పించారు. 

నాగలాండ్‌ ప్రజల శ్రేయస్సు, శాంతి, పురోగతే బీజేపీ, ఎన్డీఏ ధ్యేయమని మోదీ అన్నారు. అందుకే తమ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తివేసినట్లు చెప్పారు.

నాగలాండ్‌లో ఫిబ్రవరి 27న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2న ఫలితాలు ప్రకటిస్తారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో  నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్‌డీపీపీ)తో కలిసి పోటీ చేసింది బీజేపీ. దీంతో ఎన్డీఏ కూటమి దాదాపు అన్నిస్థానాల్లో గెలిచింది. ఎన్‌డీపీపీ నేత నీఫ్యూ రియో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేక చతికిలపడింది.
చదవండి: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ. కోటి జరిమానా!

మరిన్ని వార్తలు