రద్దు చేయకపోతే గద్దె దిగుతారు

31 Dec, 2020 08:17 IST|Sakshi

కవాడిగూడ(హైదరాబాద్‌): కొత్త వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని, లేకపోతే ప్రజాగ్రహానికి గద్దె దిగక తప్పదని అఖిల భారత రైతు పోరాటాల సమన్వయ కమిటీ(ఏఐకేఎస్‌సీసీ) ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద జరిగిన రైతు మహాధర్నా హోరెత్తింది. రైతు వ్యతిరేక చట్టాలతోపాటు, విద్యుత్‌ సంస్కరణ బిల్లునూ ఉపసంహరించుకోవాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలి్పంచాలని రైతులు, కారి్మకులతో కలసి యువజన, విద్యారి్థ, ప్రజాసంఘాలు కదంతొక్కాయి. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిరసనకారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

ధర్నాకు హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ మోదీ అధికారంలోకి రాక ముందు స్వామినాథన్‌ కమిషన్‌ను చేస్తానన్నారని, ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ రైతుల పొట్టకొడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల పక్షామా? మోదీ పక్షామా తేల్చుకోవాలని హెచ్చరించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ రైతు ఉద్యమాన్ని బీజేపీ ప్రభుత్వం వక్రీకరిస్తోందన్నారు. కార్పొరేట్‌ శక్తుల లాభాల కోసం ఆహార పంటలను నిరీ్వర్యం చేస్తూ, వాణిజ్య సాగును ప్రోత్సహిస్తున్నారని, దీని వల్ల అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయనని సీఎం కేసీఆర్‌ చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర సర్కారు ధాన్యం కొనుగోలు చేపట్టకపోతే ఢిల్లీ తరహాలోనే తెలంగాణలోనూ ఉద్యమం వస్తుందని హెచ్చరించారు.

మోదీ ప్రభుత్వానికి ప్రజాభిప్రాయంపై విలువలేదని పంజాబ్‌ రైతు ఉద్యమ నాయకుడు సత్‌బీర్‌ సింగ్‌ అన్నారు. రైతు ఉద్యమంలో రెండేళ్ల బాలుడి నుంచి 90 ఏళ్ల వృద్ధుడి వరకూ పొల్గొంటున్నారని, కచి్చతంగా గెలిచితీరతామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శులు పోటు రంగారావు, సాదినేని వెంకటేశ్వరరావు, కె.గోవర్ధన్, మాజీ రాజ్యసభ సభ్యుడు అజీజ్‌ పాషా, మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల నర్సిరెడ్డి, జూలకంటి రంగారెడ్డి, గుమ్మడి నర్సయ్య, రైతు సమన్వయ కమిటీ ప్రతినిధులు పశ్య పద్మ, సాగర్, రాయల చంద్రశేఖర్, రంగయ్య, అచ్యుతరామారావు, ఉపేందర్‌రెడ్డి, రవి, రాఘవచారి, ప్రసాద్, అబిద్‌ పరీదా, సంధ్య, రాయల రమ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు