'అప్పుడు పోరాటం.. ఇప్పుడు సరెండర్‌.. నిలకడలేని రాజకీయాలను ప్రజలు నమ్మరు'

27 Aug, 2022 19:16 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: సుప్రీంకోర్టులో ఉచితాలు అనుచితాలంటూ కేసు వేయడం దుర్మార్గమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. సమాజంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. బడుగు బలహీన వర్గాల మీద ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కార్పొరేట్‌ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వడం తప్పని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలు రద్దు చేయాలనుకోవడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు.

'సీఎం జగన్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహన లోపానికి నిదర్శనం. గతంలో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు పోరాటం చేశారు. ఎన్నికలయిన తర్వాత బీజేపీకి చంద్రబాబు సరెండర్‌ అవడానికి ప్రయత్నిస్తున్నాడు. బీజేపీతో రాసుకొని పూసుకొని తిరగడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. రాజకీయాలు నిలకడగా ఉండాలి. నిలకడలేని రాజకీయాలను ప్రజలు నమ్మరు. బీజేపీతో చంద్రబాబుది వన్‌ సైడ్‌ లవ్‌' అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు.

చదవండి: ('చంద్రబాబు నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నారు')

మరిన్ని వార్తలు