బీజేపీ మళ్లీ గెలిస్తే వినాశనమే

3 Jan, 2023 02:19 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న డి.రాజా. చిత్రంలో అజీజ్‌పాషా, కూనంనేని 

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా

మోదీ సర్కారును ఓడించేందుకు లౌకిక శక్తులు ముందుకురావాలి

సమష్టిగా వ్యూహ రచన చేయాలి

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీని ఓడించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని సీపీఐ జాతీయ ప్రధాన కార్య దర్శి డి.రాజా అన్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు సమిష్టిగా సరైన వ్యూహ రచన చేయాలని, ఇందుకు జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి పార్టీలు వాస్తవిక దృక్పథంతో వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఫాసిస్టు శక్తుల భారతీయ పరివ ర్తనా రూపమే (ఇండియన్‌ వేరియెంట్‌) ఆర్‌ఎస్‌ ఎస్, బీజేపీ అని విమర్శించారు. బీజేపీ మళ్ళీ గెలిస్తే దేశ వినాశనం తప్పదని హెచ్చరించారు. సోమవా రం పార్టీ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది తెలంగాణ, తమిళనాడు, త్రిపుర తదితర రాష్ట్రాల శాసనసభలకు జరిగే ఎన్నికల్లో కూడా బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించాలని రాజా ప్రజలకు పిలు పునిచ్చారు.

లౌకిక, ప్రజాతంత్ర పార్టీలన్నీ ఒక చోటకు చేరాలన్నారు. మోదీ పాలనలో ఆర్థిక సంక్షో భం తారాస్థాయికి చేరుకుందని, నిరుద్యోగిత రేటు 18 నెలల్లో అత్యధికంగా 8.5 శాతానికి పైగా నమో దైందని చెప్పారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా పేదలు మరింత నిరుపేదలవగా, అదానీ, అంబానీ వంటి వారి సంపద మరింత పెరిగి, వారు ప్రపంచ శత కోటీశ్వరులతో పోటీ పడుతున్నారని అన్నారు. 

జమిలి ఎన్నికలు ఆచరణ సాధ్యం కాదు
పార్లమెంటు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై సీపీఐ అభిప్రాయం కోరుతూ జాతీయ లా కమిషన్‌ ఇటీవల లేఖ రాసిందని డి.రాజా తెలిపారు. ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనేది బీజేపీ విధానమని, అయితే బహుళ రాజకీయ పార్టీల వ్యవస్థ కలిగిన భారతదేశంలో ఇది అసాధ్య మని ఆయన పేర్కొన్నారు. నిరంతరం ఎన్నికలు జరుగుతుంటే స్థిరమైన ప్రభుత్వాలు ఎలా ఉంటా యనే ప్రశ్నకు అంబేడ్కర్‌ సమాధానం చెబుతూ.. మనకు స్థిరమైన ప్రభుత్వం కావాలా?

జవాబు దారీ ప్రభుత్వం కావాలా? అంటే తాను జవాబు దారీ ప్రభుత్వాన్నే కోరుకుంటానని చెప్పార న్నారు. ప్రస్తుతం మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం జవాబు దారీతనం లేని ప్రభుత్వమని విమర్శించారు.నోట్ల రద్దు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చింది ఏకగ్రీవ తీర్పు కాదని, ధర్మాసనంలో మెజారిటీ జడ్జీలు నోట్ల రద్దును సమర్థించినప్పటికీ, ఒక జడ్జి అందుకు భిన్నంగా వేరే తీర్పును ఇచ్చారని తెలిపారు. 

డబ్బు, మతమే బీజేపీ ఎజెండా: కూనంనేని 
ప్రజా సమస్యలపై పోరాటాలను వదిలేసి, డబ్బు, మతం ఎజెండాతో రాష్ట్రంలో అధికారంలోకి రావా లని బీజేపీ భావిస్తోందని కూనంనేని విమర్శించా రు. టీఆర్‌ఎస్‌తో మునుగోడులో అవగాహన ఉన్నా ప్రజాసమస్యలపై సీపీఐ నిరతరం పోరాటాలను కొనసాగిస్తోందని, భూసమస్యలు,గవర్నర్‌ వ్యవస్థ, పోలీసు రిక్రూట్‌మెంట్‌లో తప్పులపై ఉద్యమాలు చేస్తోందన్నారు. బీజేపీ ఒక్క ప్రజా సమస్యపైనైనా పోరాటం చేసిందా అని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు