ఈటల వ్యాఖ్యలు దురదృష్టకరం: జూలకంటి

22 Aug, 2022 05:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు బీజేపీ సభలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కమ్యూనిస్టులపై చేసిన ఆరోపణలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు­డు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమ స్యలపై పోరాటాలు నడిపిస్తున్న చరిత్ర కమ్యుని­స్టులకు ఉందన్నారు.

ముఖ్యంగా కొంత కాలంగా రాష్ట్రంలో పోడు భూముల సమస్య, కౌలు రైతుల సమస్యలపై పోరాడుతున్నా­మన్నారు. ఈ సమ­స్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఏ ప్రభుత్వం ఉన్నా పోరాటాలు సాగిస్తూనే ఉంటామన్నారు. ఇవన్నీ చూస్తూ కూడా ఈటల రాజేందర్‌ మునుగోడులో కమ్యూనిస్టులపై విమర్శలు చేయడం దురదృష్టకరమని రంగారెడ్డి విచారం వ్యక్తంచేశారు.  

మరిన్ని వార్తలు