బీజేపీ కుట్రలను తిప్పి కొడదాం: తమ్మినేని వీరభద్రం

17 Sep, 2021 09:00 IST|Sakshi
సభలో మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం

సాక్షి, సూర్యాపేట(నల్లగొండ): వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో తెలంగాణ గడ్డ మీద హిందూమతం పేరుతో బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పి కొడదామని   సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో సీసీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభను నిర్వహించారు.

ఈ సందర్భంగా తమ్మినేని హాజరై తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న  వారిని సన్మానించి మాట్లాడారు. ఈ  కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు జూలకంటి రంగారెడ్డి,  మల్లు లక్ష్మి, నాగార్జునరెడ్డి,  ఎం.రాములు,  కె.యాదగిరిరావు, ధీరావత్‌ రవినాయక్, బి.శ్రీరాములు, కోట గోపి, గోవిందు, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.  

చదవండి: సెప్టెంబరు 17: సాయుధ చరిత్రకు సాక్ష్యాలు

మరిన్ని వార్తలు