టీఆర్‌ఎస్ ఇలానే ఉంటే సార్వత్రిక ఎ‍న్నికల్లోనూ మద్దతు

4 Sep, 2022 07:41 IST|Sakshi

బీజేపీ పట్ల టీఆర్‌ఎస్‌ వైఖరిని బట్టి తోడ్పాటు 

సీఎం కేసీఆర్‌తో భేటీలో సీపీఎం ప్రముఖులు

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ ఓటమే లక్ష్యంగా మునుగోడు శాస నసభ ఉప ఎన్నిక వరకే టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర పార్టీ స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికల్లోనూ మద్దతు ఇవ్వాలనే ప్రతిపాదనపై స్పందిస్తూ ప్రస్తుతం బీజేపీ పట్ల టీఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న వైఖరి అప్పుడు కూడా కొనసాగితే తప్పకుండా మద్దతిస్తామని చెప్పింది. శనివారం సీఎం కేసీఆర్‌తో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారా ములు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి భేటీ అయ్యారు.

ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకం కావాలని సీఎం కోరగా... ఆ మేరకు కట్టుబడి పని చేద్దామని సీపీఎం నేతలు పేర్కొనట్లు తెలిసింది. భవిష్యత్తులో పరి స్థితులకు అనుగుణంగా ముందుకెళ్తామన్నట్లు సమాచారం. అలాగే, రాష్ట్రంలోని వివిధ వర్గాల సమస్యల పైనా సీపీఎం నేతలు ముఖ్య మంత్రితో చర్చించారు. కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం వారికి హామీ ఇచ్చారు.
సీపీఎం లేవనెత్తిన ప్రధాన అంశాలు

► 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు రైతులకు పట్టాల పంపిణీ చేయాలి. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులివ్వాలి.
► వ్యవసాయ కార్మికులకు కనీస వేతన జీవో సవరణ చేయాలి. రోజు కూలీ రూ.600 ఇవ్వాలి.
► అర్హులైన పేదలందరికీ 120 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణా నికి రూ.5లక్షల సాయం చేయాలి. ఆర్టీసీలో యూనియన్లను అనుమతి ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలి. ధరణి పోర్టల్లో సవరణలు చేసి పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలి. రూ.లక్ష లోపు రైతుల రుణాలన్నీ ఏకకాలంలో మాఫీ చే యాలి. గిరిజన జనాభా ► నిష్పత్తి ప్రకారం 10శాతానికి రిజర్వేష న్లను పెంచాలి. అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి సమర్పించాలి. 

తెలంగాణలో మత విద్వేషాలకు తావు లేదు : సీఎం కేసీఆర్‌
తెలంగాణలో మత విద్వేషాలకు తావులే దని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రజల్లో విద్వేషాలను పెంచేందుకు ప్రయత్నించే దుష్టశక్తులను ఐక్యంగా తిప్పికొడదామ న్నారు. మతం పేరుతో ప్రజల నడుమ విభజన తేవాలని చూసే స్వార్థ రాజకీయాలను తిప్పికొట్టేందుకు తమతో కలిసి రావాలని మేధావులను కేసీఆర్‌ ఆహ్వానించారు. స్వార్థ రాజ కీయాల కోసం విచ్ఛిన్నకర శక్తులు పచ్చని తెలంగాణలో మతం పేరుతో చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని చెప్పారు.

ఆ కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజాస్వామికవా దులు, మేధావులు, రాజకీయవేత్తలు కదిలి రావాలని తాని చ్చిన పిలుపునకు స్పందించి మద్దతు ప్రకటించేందుకు వచ్చిన సీపీఎం పార్టీకి కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. మత విద్వేష శక్తులను ఎదుర్కునేందుకు సీఎం చేస్తున్న పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని సీపీఎం నేతలు స్పష్టం చేశారు.
చదవండి: ‘సిట్టింగులందరికీ సీట్లు’

మరిన్ని వార్తలు