‘దుబ్బాక ఫలితం కేసీఆర్ కి చెంపపెట్టు’

10 Nov, 2020 21:19 IST|Sakshi

దుబ్బాక ఉపఎన్నిక ఓ గుణాత్మక మార్పుకు నాంది

సీఏం కేసీఆర్ ఇకనైనా కళ్ళు తెరవాలి 

రానున్న ధర్మ యుద్ధంలో విజయం కాంగ్రెస్‌దే 

ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్

సాక్షి, హైదరాబాద్‌ : దుబ్బాక ఉపఎన్నికలో ప్రజల ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేసీఆర్ అహంకారానికి చరమగీతమని కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి డాదాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. దుబ్బాక ఉపఎన్నిక ఫలితం పై గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి  ఓట్లు వేసిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్- బీజేపీ లోపాయకారి ఒప్పందం జరిగిందనే అనుమానం వ్యక్తం చేశారు. 

 ‘దుబ్బాక ఫలితం కాంగ్రెస్ పార్టీని నిరాశ పరిచినప్పటికీ కూడా ఈ ఉపఎన్నిక ఓ గుణాత్మక మార్పుకు నాంది పలికింది. రాజకీయ మాయలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవచ్చు కానీ రానున్న ధర్మ యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయం. ప్రజలు కోరుకున్న సామాజిక, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది. దుబ్బాక ఫలితాలని లోతుగా పరిశీలిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కి చెంపపెట్టు. ఆధిపత్య అహంకారంతో నిరంకుశంతో పోలీసులని, రెవెన్యు శాఖని, డబ్బుని అడ్డం పెట్టుకొని, అధికార మదంతో విర్రవీగుతున్న కేసీఆర్ కి కర్రకాల్చి వాత పెట్ట్టినట్లుగా దుబ్బాక ప్రజలు బుద్ధి చెప్పారు. తన ఇంట్లో కుక్క చచ్చిపోతే ఆ కుక్కపై వున్న ప్రేమ  వరదల్లో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ ప్రజలపై  లేదు. వరద బురదలో అష్టకష్టాలు పడినవారి మీద లేదు. ఇలాంటి అహంకారి కేసీఆర్ కు దుబ్బాక ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. తమ ఓటుతో కేసీఆర్ అహంకారం దించారు. నిజాం నవాబ్ అప్పట్లో శిస్తులు వసూలు చేసి ప్రజల రక్తం తాగితే ఈ రోజు కేసీఆర్ ఎల్ ఆర్ఎస్ పేరుతో ప్రజల రక్తం తాగే ప్రయత్నం చేస్తున్నారు.
(చదవండి : దుబ్బాకలో బీజేపీ సంచలన విజయం)

నిర్బంధ వ్యవసాయమని ప్రజలని నానా ఇబ్బందులు పెడుతున్నారు. మల్లన్న సాగర్ దగ్గర రైతుల భూములు దౌర్జన్యంగా గుంజుకున్న కేసీఆర్ కు ఆ రైతుల ఉసురు తగిలింది. కేసీఆర్ ఇకపై తన అహంకారాన్ని వీడి భూమిపైకి రావాలి. ప్రజల ఆలోచనకు అనుగుణంగా పని చేయాలి. పధకాలని ఎర వేసి ఓట్లు పట్టుకోవాలనే కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనకు కూడా దుబ్బాక ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. సిద్ధిపేట, గజ్వేల్ లకు మాత్రమే వేల కోట్ల రూపాయిలు కేటాయించి  దుబ్బాకని గాలికి వదిలేసిన కేసీఆర్ కు దుబ్బాక ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. ఈ ఫలితం కేసీఆర్, హరీష్ రావు కు చెంపదెబ్బ. దుబ్బాక ప్రజలు కసితో టీఆర్ఎస్ ప్రజలు ఓడించారు. కేసీఆర్ ఇకనైనా ప్రజలు ఏం కోరుకుంటున్నారో గ్రహించి, ప్రజలు కోరుకున్న రీతిలో పరిపాలన చేయాలని' సూచించారు 
(చదవండి : దుబ్బాక ఫలితాలపై రాములమ్మ స్పందన)

టీఆర్ఎస్- బీజేపీ కుట్ర కోణం 
వాస్తవానికి దుబ్బాక నియోజిక వర్గం కాంగ్రెస్ పోర్ట్ కాదు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించిన నియోజిక వర్గం కాదు. అయినప్పటికీ గతంలో పార్లమెంట్ లో 20వేల ఓట్లు వస్తే ఈ ఎన్నికలో 22 వేల ఓట్లు వచ్చాయి. రెండు వేల ఓట్లు పెరిగాయి. దీనిపై  పూర్తి సంతృప్తి వ్యక్తం చేయనప్పటికీ  ఇక్కడ ఓటర్లు కానీ మీడియా మిత్రులు కానీ అర్ధం చేసుకోవాల్సిన  ఓ విషయం వుంది. టీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి షేర్ అయాయ్యి. ఇందులో ఆ రెండు పార్టీల కుట్ర కోణం ఉందనే అనుమానాలు వున్నాయి. రఘునందన్ రావు ప్రచారం మొదలుపెట్టినపుడు ఏమంత ప్రాభల్యం కనబరచలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా వుందనే వాతావరణం ఏర్పడింది. ఆ వాతావరణం నుండి ప్రజల ద్రుష్టిని మళ్లించేదుకు, రఘునందన్ రావుకి ప్రాభల్యం పెంచేటందుకు, కుట్ర కోణంలో ఆయన కార్లు ఆపడం, కార్ల టైర్లు కోయడం , టీఆర్ ఎస్ పార్టీని కొమ్ము కాస్తున్న మీడియా వర్గాలు , టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున దాన్ని చూపించడం, తర్వాత రఘునందన్ రావు మామ ఇంట్లో కి వెళ్లి డబ్బులు వున్నాయని దాడి చేయడం , దాన్ని మీడియాలో హైలెట్ చేసి చూపించడం .. ఇవన్నీ చూస్తుంటే రఘునందన్ రావు కి సానుభూతి పెంచడానికి టీఆర్ఎస్ పార్టీ ఏదైనా కుట్ర చేసిందా ? టీఆర్ఎస్ కి బీజేపీ లోపాయకారి ఒప్పందం ఉందా ?’అని దాసోజు శ్రవణ్ అనుమానం వ్యక్తం చేశారు.

 ‘టీఆర్ఎస్ తన చర్యల ద్వారా రఘునందన్ కు సానుభూతి వచ్చేలా చేసింది. అందుకే ఈ విజయాన్ని బీజేపీ విజయం కాకుండా రఘునందన్ కు సానుభూతి వలన వచ్చిన విజయంగానే తాము భావిస్తున్నాం. ఇక్కడ మరో విషయం వుంది. టీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ ట్రబుల్ షూటర్ గా పేరున్న మంత్రి హరీష రావు ఇమేజ్ ని తగ్గించేందుకు కుట్ర జరిగిందా? అనే కోణం కూడా ఉంది. అయితే ఈ ఫలితంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరూ కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఓటమి నిరాశ కలిగిస్తుంది. అయితే ఓటమే విజయానికి సోపానం. మేము యుద్దం చేసి ఓడిపోయాం​‍’ అని దాసోజు శ్రవణ్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు