కాంగ్రెస్ పార్టీ కీలక తీర్మానం

31 Jan, 2021 20:25 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని తక్షణమే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయాలనీ కీలక తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని ఢిల్లీ కాంగ్రెస్ నేడు సాయంత్రం ఏకగ్రీవంగా ఆమోదించింది. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుంది అని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ నియంతృత్వ పరిపాలను ఎదుర్కోవాలంటే రాహుల్ గాంధీ నాయకత్వమే సరైనదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, ఇదే సమయంలో మరో రెండు తీర్మానాలను కూడా ఢిల్లీ కాంగ్రెస్ నేతలు చేశారు.(చదవండి: ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. బీజేపీపై కేటీఆర్‌ ఆగ్రహం)

రైతు ఉద్యమంలో భాగంగా గణతంత్ర దినోత్సవం రోజున చోటు చేసుకున్న ఘర్షణలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు జగదీష్ టైట్లర్, రమేష్ కుమార్, కృష్ణ తీత్, నరేంద్ర నాథ్, యోగానంద్ శాస్త్రి కిరణ్ వాలియా హరూన్ సహా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేతలందరూ హాజరయ్యారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరమైన ఓటమిని చవిచూసిన తర్వాత పార్టీ చీఫ్ పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అనేక సార్లు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించాలని పార్టీ శ్రేణులు కోరుకున్నప్పటికీ తను నాయకత్వాన్ని చేపట్టలేదు. ఆయన రాజీనామా చేసినప్పటి నుంచి తాత్కాలిక చీఫ్ గా ఆయన తల్లి సోనియా గాంధీ భాద్యతలు వహిస్తున్నారు. ఈ పదవిని ఎక్కువకాలం చేపట్టడానికి తనకు ఆసక్తి లేదని సోనియా గాంధీ గతంలో స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు