ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం.. ‘ఆప్‌’ మంత్రి రాజీనామా

9 Oct, 2022 17:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మత మార్పిడి వివాదంలో చిక్కుకుని ఆరోపణలు ఎదుర్కొన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ మంత్రి రాజేంద్ర పాల్‌ గౌతమ్‌ తన పదవికి రాజీనామా చేశారు. మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొనటంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. పదవి నుంచి తొలగించాలని ఆందోళనలు చేపట్టటంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. వివాదాస్పదం కాకుండా ఉండేందుకు మంత్రి చేత రాజీనామా చేయించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 

వివాదం ఏమిటి?
దసరా రోజు(ఈనెల 5న) ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో భారీ సంఖ్యలో హిందువులు బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్న కార్యక్రమంలో ఢిల్లీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్‌ పాల్గొనడంపై తీవ్ర వివాదం ముసురుకుంది. మతం మారుతున్న వ్యక్తులు హిందూ దేవుళ్లు, దేవతలను దూషిస్తున్నట్లుగా ఉన్న వీడియో దృశ్యాలు గత శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. ఇటువంటి కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నేతృత్వం వహించటంపై బీజేపీ, వీహెచ్‌పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌతమ్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను డిమాండ్‌ చేశారు. కేజ్రీవాల్‌ ప్రభుత్వంలో గౌతమ్‌ సాంఘీక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు.

ఇదీ చదవండి: రాహుల్‌ అంటే భారత్‌.. భారత్‌ అంటే రాహుల్‌: యూపీ కాంగ్రెస్‌

మరిన్ని వార్తలు