వెనుకబడిన ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం జిల్లాలు గుర్తులేదా?

8 Mar, 2021 14:29 IST|Sakshi

శ్రీకాకుళం : 'అమరావతి నీకు..నీ చుట్టూ ఉన్న కోటరికి అవసరం. అమరావతి కంటే వెనుకబడిన ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం జిల్లా నీకు గుర్తులేదా' అని డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణదాస్ చంద్రబాబుపై మండిపడ్డారు. విశాఖపట్నం రాజధాని దేనికి అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నాడని, ఉత్తరాంధ్ర అంటే జగదాంబ సెంటర్ కాదని ధర్మాన ఫైర్‌ అయ్యారు. 'ఉత్తరంధ్రాలో సాగునీరు లేక ఏండిన పొలాలను ఏనాడైనా చూశావా?నీ ఐదేళ్ళ పాలనలో వంశధార ప్రాజెక్టును పూర్తి చేయ్యగలిగావా? గిరిజన గ్రామాల్లో రహదారులు లేక వైద్యం కోసం అల్లాడిన పేదలు భాధలు ఏనైడా ఆర్ధమయ్యాయా?నువ్వు ముఖ్యమంత్రిగా అనర్హుడవనే ప్రజలు నీకు 23 సీట్లకు పరిమతం చేశారు. ఆ భగవంతుడే నిన్ను శిక్షించాడు' అని డిప్యూటీ సిఎం ధర్మాన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. పాదయాత్ర చేసి అన్ని ప్రాంతాల సమస్యలు తెలుసుకుని... వికేంద్రీకరణ ద్వార మూడు రాజధానులు పెట్టిన గొప్ప మనసున్న నాయకుడు సిఎం జగన్ అని ప్రశంసించారు. 

అనంతపురం: మున్నిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం ఖాయమని ఎమ్మెల్యే అనంత వెంటరామిరెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికల కంటే ఎక్కువ ఫలితాలు ఈ ఎన్నికల్లో వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఓటమికి కారణాలు వెతుక్కుంంటున్నారని, వరుస ఓటములతో చంద్రబాబు, లోకేష్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని ధ్వజమెత్తారు. ఏపీలో టీడీపీ పతనావస్థకు చేరిందని, జగన్ అద్భుతమైన పరిపాలనకు ప్రజలు మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. 140 కోట్ల రూపాయల తో రోడ్లు నిర్మించామని, త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని, అనంతను స్మార్ట్ సిటీగా మార్చబోతున్నామని తెలిపారు. 

చదవండి : (ఎంపీ కేశినేనిని దూరంపెట్టిన చంద్రబాబు..)
(మహిళపై చేయిచేసుకున్న అశోక్‌ గజపతి రాజు)

మరిన్ని వార్తలు