‘ఏపీ ప్రజలకు చంద్రబాబు డ్రామా అంతా తెలుసు’

20 Sep, 2021 20:27 IST|Sakshi

డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

సాక్షి, విజయవాడ: పరిషత్‌ ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చిత్తుగా ఓడిన టీడీపీ నేతలు ఎన్నికలను బహిష్కరించామని చెప్పడం దారుణమన్నారు. గతంలో జయలలిత ఎన్నికలను బహిష్కరించినప్పుడు అన్నాడీఎంకే గుర్తుపై ఎవరూ పోటీ చేయలేదన్నారు. ఏపీ ప్రజలకు చంద్రబాబు డ్రామా అంతా తెలుసునని నారాయణ స్వామి అన్నారు.
చదవండి:
‘వైఎస్సార్‌సీపీ విజయాన్ని ఎల్లో మీడియా వక్రీకరించింది’
ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం మేమే అడిగాం: నిర్మాత కళ్యాణ్

మరిన్ని వార్తలు