మీ అవినీతిని రాస్తే పెద్ద గ్రంథం అవుతుంది: ధర్మాన

10 Nov, 2020 18:17 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: భూములు అమ్మేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పత్రికలు గగ్గోలు పెడుతున్నారని, అది వృధా ప్రయాస అని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవరత్నాలు, నాడు-నేడు నిధుల కోసం భూములు వేలం వేస్తున్నామని స్పష్టం చేశారు. పూర్తి పారదర్శకత దేశంలో ఎవరైనా వాటిని కొనుగోలు చేసేలా ఈ-వేలం వేస్తున్నామన్నారు. గడిచిన మీ హయాంలో ఎన్నికల్లో లబ్ది చేకూర్చిన వారికి ఎన్ని భూములు కట్టాబెట్టారో ప్రపంచానికి తెలుసని వ్యాఖ్యానించారు. అయితే తాము సద్వివిమర్శను ఆహ్వానిస్తామని, మీ అవినీతిని రాస్తే పెద్ద గ్రంథం అవుతుందని విమర్శించారు. రాజధాని పేరుతో పేదల నుంచి బలవంతంగా అసైన్డ్‌ భూములు సేకరించింది మీరు కాదా? అని వాటిని పెద్దలకు కట్టబెట్టింది మీ హయాంలోనే కాదా? అని ఆయన ప్రశ్నించారు.

ప్రజా కోర్టులో స్ఫష్టమైన తీర్పు వచ్చిదన్నారు. కాళ్ళకు గజ్జెలు కట్టుకుని అచ్చెన్నాయుడు రాషష్ట్రంలో తిరుగుతా అంటున్నారని వెంటనే తిరగండని పేర్కొన్నారు. విశాఖలో భూ కుంభకోణం చూసి మీ హయాంలో మంత్రులే రోడ్డున పడ్డారని, త్వరలో సమగ్ర భూ సర్వేకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 100 ఏళ్లనాటి రికార్డులు ప్యూరిఫికేషన్‌ చేస్తామని, మొబైల్‌ కోర్టులు ఏర్పాటు చేసి భూ సమస్యలు వెంటనే పరిష్కరిస్తామన్నారు. నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు మీటర్లు బిగిస్తున్నామని, త్వరలో అంత: రాష్ట్ర వివాదాలు పరిష్కరించి నేరడి బ్యారేజ్‌ నిర్మించి తీరుతామని ధర్మాన పేర్కొన్నారు. 

ప్రభుత్వ విప్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాతయాత్ర
కృష్ణా జిల్లా: ప్రజాసంకల్ప యాత్రకు మూడేళ్లు అయిన సందర్బంగా ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది. పెనుగ్రంచిప్రోలు పాత సినిమా హాలు సెంటర్ నుంచి మున్నేరు వంతెన‌ మీదగా ముచ్చింతల వరకు ఈ పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ... దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలని నేరుగా తెలుసుకున్న నేత సిఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు.  ఏడాదిన్నర పరిపాలనలో 90 శాతానికి పైగా హామీలను ఆయన నెరవేర్చారన్నారు. ప్రజలకిచ్చిన నవరత్నాల హామీలే కాకుండా 16 రకాలకు పైగా సంక్షేమ‌ పథకాలను సీఎం వైఎస్ జగన్ అందిస్తున్నారని తెలిపారు.

అన్ని వర్గాలకు అండగా నిలబడిన ప్రభుత్వం తమదని, గత ప్రభుత్వం అభివృద్దిని, సంక్షేమాన్ని రెండింటినీ విస్మరించిందన్నారు. నాడు-నేడు కార్యక్రమంతో విద్య, వైద్యంలో విప్లకాత్మకమైన‌ మార్పులకి సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తే... సీఎం వైఎస్ జగన్ వైద్య ఖర్చు వెయ్యి రూపాయిలు దాటితే ఆరోగ్యశ్రీలోకి చేర్చి పేదలకి అండగా నిలబడ్డారన్నారు. పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మరో 30 ఏళ్లు కొనసాగుతారని ప్రభుత్వ విప్‌ పేర్కొన్నారు. కాగా ఈ పాదయాత్రలో భారీ సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా