టీడీపీ హయాంలో సెంటు ఇంటి స్థలం కూడా పంపిణీ చేయలేదు..

19 May, 2022 05:45 IST|Sakshi

మంత్రి ధర్మాన ప్రసాదరావు

సాక్షి, గుంటూరు: టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు సెంటు ఇంటి స్థలం కూడా పంపిణీ చేయలేదని రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్‌ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. గుంటూరు కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన డీఆర్సీ సమావేశంలో పాల్గొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏకంగా రూ.7వేల కోట్లకు పైగా ఖర్చు చేసి, 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారని గుర్తుచేశారు.

ఎలాంటి వివక్ష, పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఒక్క అవినీతి ఆరోపణ కూడా చేయలేని విధంగా  పాలన సాగుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల వల్ల నష్టపోయిన మిర్చి రైతులకు పరిహారం అందించడంలో సమస్య ఏర్పడిందని,  రైతులను ఆదుకోవడంలో దేశంలోనే ఏపీ ముందు వరుసలో ఉంటుందని మంత్రి ధర్మాన తెలిపారు.  

మరిన్ని వార్తలు