మా నాన్నకు మైల్డ్ పెరాలసిస్‌, చెప్పింది మర్చిపోయే డిమెన్షియా: అరవింద్‌

27 Mar, 2023 21:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌లో డీఎస్ చేరిక వ్యవహారంపై  ఆయన చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.  తన తండ్రి మైల్డ్ పెరాలసిస్‌తో పాటు, చెప్పింది మర్చిపోయే డిమెన్షియాతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ సమయంలో ఆయనను గాంధీభవన్‌కు తీసుకెళ్లి పార్టీ కండువా కప్పడం సబబు కాదన్నారు.

' మా నాన్న మైండ్ స్ట్రోక్ వచ్చి బాధపడితే కనీసం సోనియా గాంధీ గానీ ఇంకెవరు గానీ పలకరించినవాళ్లు లేరు. నా తండ్రి కట్టర్ కాంగ్రెస్ వ్యక్తి అని నేనే పలుమార్లు చెప్పాను. ఆయన కాంగ్రెస్లోకి వెళ్లినా, కమ్యూనిస్టు పార్టీలోకి వెళ్లినా నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ, ఇది సమయం కాదు.. జాయిన్ చేసుకునే పద్ధతి ఇది కాదు. సోనియానో , ఇంకెవరైనా ఆ స్థాయి వాళ్లో ఆయన ఇంటికే వెళ్లి కండువా కప్పితే భావ్యం తప్ప ఇది పద్ధతి కాదన్నదే నా ఉద్దేశం'  అని అరవింద్ అన్నారు.

కాగా.. డీఎస్, ఆయన పెద్ద కుమారుడు సంజయ్ ఆదివారం గాంధీభవన్‌ వెళ్లి కాంగ్రెస్‌లో చేరారు. కానీ ఒక్కరోజుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధిష్టానానికి  లేఖ రాశారు. తాను పార్టీలో చేరలేదని, కానీ  చేరినట్లు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అయితే ఈ లేఖను తన తమ్ముడు అరివింద్ బ్లాక్‌మెయిల్ చేసి రాయించాడని సంజయ్ ఆరోపించారు. తన తండ్రి అనారోగ్యంపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం అన్నాదమ్ముల మధ్య పొలిటికల్ హీట్ పెంచింది. సంజయ్ ఆరోపణల నేపథ్యంలోనే అరవింద్ సోషల్ మీడియా వేదికగా స్పందించి వివరణ ఇచ్చారు.

చదవండి: కాంగ్రెస్‌లో చేరిక పంచాయితీ.. డీఎస్‌ తనయుల వార్‌! తండ్రిని బ్లాక్‌ మెయిల్‌ చేశారా?

మరిన్ని వార్తలు