కాంగ్రెస్‌ అధ్యక్ష బరిలో దిగ్విజయ్‌ సింగ్‌?

28 Sep, 2022 16:53 IST|Sakshi

భోపాల్‌: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే రేసులో సీనియర్‌ నేత శశిథరూర్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ ఉండనున్నారని స్పష్టంగా తెలుస్తోంది. అయితే.. ఇప్పుడు మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కీలక నేత దిగ్విజయ్‌ సింగ్‌ పేరు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్‌ అధ్యక్ష రేసులో ఆయన సైతం ఉన్నారని, గురువారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దిగ్విజయ్‌ సింగ్‌ పోటీలో నిలుస్తారా? లేదా అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో.. స్పష్టతనిచ్చారు సింగ్‌. భోపాల్‌లో ఓ విలేకరి ప్రశ్నించగా పలు విషయాలు వెల్లడించారు.

‘ఈ విషయంపై నేను ఎవరితోనూ చర్చించలేదు. పోటీలో నిలిచేందుకు అధిష్టానం అనుమతి ఇవ్వాలని కోరలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. నేను పోటీ చేస్తానా? లేదా అనేది నాకే వదిలేయండి.’ అని విలేకరుల సమావేశంలో తెలిపారు. మరోవైపు.. అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభానికి దారితీశాయి. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ మద్దతు ఎమ్మెల్యేలు సుమారు 80కిపైగా రాజీనామాలు సమర్పించటం కలకలం సృష్టించింది. ఈ క్రమంలో గెహ్లాట్‌ను రేసు నుంచి తప్పించాలనే డిమాండ్లు సైతం వచ్చాయి. కానీ, ఆయన పోటీ చేస‍్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొనటం చేయటం గమనార్హం. మరోవైపు.. అశోక్‌ గెహ్లాట్‌ రేసు నుంచి తప్పుకుంటే దిగ్విజయ్‌ సింగ్‌కే అవకాశాలు ఉన్నాయని పార్టీలో వినిపిస్తోంది. 

ఇదీ చదవండి: ఇద్దరే పోటీ చేయాలా? అధ్యక్ష రేసులో నేనూ ఉన్నా.. కాంగ్రెస్‌ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు