బుద్ధప్రసాద్‌ డ్రామా.. షాకిచ్చిన దివిసీమ రైతులు

25 Aug, 2023 15:39 IST|Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డలో టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్‌కు దివిసీమ రైతాంగం షాకిచ్చింది. పులిగడ్డ ఆక్విడెక్ట్ వద్ద రైతు సమస్యలపై సామూహిక సత్యాగ్రహ దీక్ష పేరిట  బుద్ధ ప్రసాద్‌ డ్రామాకు తెరతీశారు.

బుద్ధ ప్రసాద్‌కు వత్యిరేకంగా పులిగడ్డ సెంటర్‌లో దివిసీమ రైతులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నాడు-నేడు పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన దివిసీమ రైతాంగం.. చంద్రబాబు ప్రభుత్వంలో రైతుల పరిస్థితి, సీఎం జగన్‌ ప్రభుత్వంలో రైతుల పరిస్థితులపై ఫోటోలు ప్రదర్శించారు.

రైతులకు మేలు చేయకపోగా దొంగ దీక్షలు ఎందుకంటూ మండలి బుద్ధ ప్రసాద్‌ను దివిసీమ రైతులు నిలదీశారు.
చదవండి: ఆర్జీవీ థర్డ్‌ గ్రేడ్‌ అంటూ లోకేశ్‌ వ్యాఖ్యలు.. రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చిన వర్మ

మరిన్ని వార్తలు