రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్‌ తాకట్టు పెట్టారు 

9 Jul, 2021 01:14 IST|Sakshi

కృష్ణా జలాల సాధన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో డీకే అరుణ  

సాక్షి, హైదరాబాద్‌: కృష్టా జలాల వినియోగంలో తెలంగాణ ప్రయోజనాలను సీఎం కేసీఆర్‌ ఆంధ్రాకు తాకట్టు పెట్టారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. గురువారం టీజేయూ, తెలంగాణ జల సాధన సమితి ఆధ్వర్యం లో ‘కృష్టా జలాల సాధన కోసం మర్లబడుదాం రండి’ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆమె మాట్లా డారు. తెలంగాణకు కేటాయించిన 299 టీఎంసీల కృష్టా జలాలను వినియోగించుకోవటంలో సీఎం విఫలమయ్యారని ఆరోపించారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో 4 ప్రాజెక్టుల నిర్మాణ పనులు 90 శాతం పూర్తి కాగా, మిగిలిన అరకొర పనులు ఏడేళ్లు గడిచినా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాల సీఎంలతో కేంద్రం సమావేశం నిర్వహించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ సూచించారు. వైఎస్సార్‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. 

మరిన్ని వార్తలు