సర్కారును మంత్రులే కూల్చేస్తారు: డీకే

7 Dec, 2021 08:15 IST|Sakshi

సాక్షి, శివాజీనగర(కర్ణాటక): బీజేపీ సర్కారు బలహీనం కాగా, సీఎం బొమ్మై నిస్సహాయుడు అయ్యారు, మంత్రులే ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నా ఏమీ చేయలేకపోతున్నారు అని కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్‌ హేళన చేశారు. ఆయన సోమవారం బెళగావిలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి కే.ఎస్‌.ఈశ్వరప్ప ఏమో సీఎం మారతారని అంటారు, మరో మంత్రి మురుగేశ్‌ నిరాణి కొత్త సీఎం అవుతారంటారు.

మంత్రుల వల్ల ఈ ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుంది. ప్రతిపక్ష పార్టీల పాత్ర ఇందులో ఉండదు అని జోస్యం చెప్పారు. మాజీ సీఎం యడియూరప్పపై బీజేపీ ఐటీ దాడులు చేయించి, బలవంతంగా రాజీనామా చేయించడంతో ఆయన కన్నీరు కార్చారని చెప్పారు. బీజేపీలోకి చేరలేదని తనను తీహార్‌ జైలుకు పంపారని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు