దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇలా.. 

18 Sep, 2023 08:02 IST|Sakshi

హైదరాబాద్: రెండు రోజుల పాటు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రత్యేక పార్లమెంట్ సెషన్ల గురించి ప్రస్తావిస్తూ ఎటువంటి ఎజెండా లేకుండా పిలుపునివ్వడం చూస్తుంటే దేశంలో చట్టం పనితీరు ఎలా ఉందో అర్ధమవుతుందని అన్నారు.  

 

హైదరాబాద్ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు ముగిసిన తర్వాత కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో గెలవడమే మా ప్రధాన ఎజెండా అని తద్వారా ఇండియా కూటమిని గెలిపించుకోవడమే మా ముందున్న లక్ష్యమని అది తప్ప మాకు వేరే ఏ ఎజెండా లేదని అన్నారు. ఇక సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సెషన్ల గురించి స్పందించారు. ఎటువంటి ఎజెండా లేకుండా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం దేశ చరిత్రలోనే తొలిసారి జరుగుతోందని దీన్ని బట్టే దేశంలో చట్టాల పరిస్థితి ఏమిటనేది అర్ధం చేసుకోవచ్చని ఇది చాలా దురదృష్టకరమని అన్నారు.

రెండు రోజులపాటు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో వచ్చే ఎన్నికలకు సంబంధించి కొన్ని తీర్మానాలు చేశారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండటాన్ని స్వాగతిస్తూనే దీన్ని ప్రధాన మంత్రి తోపాటు బీజేపీ శ్రేణులు కూడా జీరించుకోలేకపోతున్నాయని రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దేశాన్ని విభజన రాజకీయాలు, విద్వేష పాలన నుండి విముక్తి కలిగించడానికి సైద్ధాంతిక సిద్ధపాటుతో ఇండియా కూటమి ముందుకొచ్చిందని చెబుతూ సామాజిక సమానత్వాన్ని సాధించి న్యాయాన్ని బలపరిచి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ప్రజా సమస్యలపై స్పందిస్తూ, సున్నితమైన, పారదర్శకమైన, జవాబుదారీగా ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని అందించాలని కమిటీ తీర్మానించింది.  ఈ సందర్బంగా అటవీరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల గురించి కూడా కమిటీ చర్చించింది. 

ఇది కూడా చదవండి: న్యాయ వ్యవస్థ ప్రగతికైనా, వినాశనానికైనా నిజాయతీయే కీలకం

మరిన్ని వార్తలు