డీఎండీకే ఒంటరేనా? 

19 Feb, 2021 06:34 IST|Sakshi
విజయ్‌ కాంత్, ప్రేమలత

దరఖాస్తులపై డీఎండీకే దృష్టి 

ఆప్‌తో కమల్‌ 

సాక్షి, చెన్నై: డీఎండీకే ఒంటరి పయనానికి సిద్ధమవుతున్నట్టుంది. పార్టీ తరఫున 234 నియోజకవర్గాల్లోనూ పోటీకి ఉత్సాహంగా ఉన్న ఆశావహుల నుంచి దరఖాస్తుల ఆహ్వానానికి ఆ పార్టీ నేత విజయకాంత్‌ గురువారం నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల్ని అన్నాడీఎంకేతో కలిసి ఎదుర్కొన్న డీఎండీకేకు డిపాజిట్లే కాదు, ఓటు బ్యాంక్‌ గల్లంతైంది. అయితే, పార్టీ ఎన్నికల కమిషన్‌ గుర్తింపు రద్దు కాలేదు. దీంతో ఆ పార్టీ చిహ్నం ఢంకా మళ్లీ వారి చేతికే వచ్చినట్లైయింది. ఈ పరిస్థితుల్లో తాజా ఎన్నికల్ని అన్నాడీఎంకేతో కలిసి ఎదుర్కొనేందుకు డీఎండీకే సిద్ధంగా ఉన్నా, అన్నాడీఎంకే నుంచి  స్పందన కరువైంది. ఇప్పటికే పలుమార్లు డీఎండీకే కోశాధికారి ప్రేమలతా విజయకాంత్‌ అన్నాడీఎంకేకు హెచ్చరికలు చేసినా ఫలితం కనిపించలేదని చెప్పవచ్చు.

దీంతో ఒంటరి పయనానికి డీఎండీకే సిద్ధమవుతున్నట్టు తెలిసింది. దీంతో  పార్టీ తరఫున  ఆశావహుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించేందుకు విజయకాంత్‌ నిర్ణయించారు.  రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లోనూ దరఖాస్తుల ఆహ్వానానికి చర్యలు చేప ట్టారు. ఈనెల 25 నుంచి మార్చి 5 వరకు ఈ ప్రక్రియ సాగనుంది. తమిళనాడులో రిజర్వుడ్‌ స్థానానికి రూ.10వేలు, పుదుచ్చేరిలో రూ.5వేలు, జనరల్‌ స్థానానికి తమిళనాడులో రూ.15 వేలు, పుదుచ్చేరిలో 10 వేలు దరఖాస్తుతోపాటు డిపాజిట్‌ చెల్లించాలని విజయకాంత్‌ ప్రకటించారు.

ఆప్‌తో కమల్‌ మంతనాలు.. 
కమల్‌ నేతృత్వంలో మక్కల్‌ నీది మయ్యం సైతం తమ నేతృత్వంలో ఓ కూటమి ఏర్పాటుకు పిలుపునిచ్చినా స్పందించిన పారీ్టలు కరువే. దీంతో తమ సిద్ధాంతాలకు అనుగుణంగా, అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న, మార్పును ఆశిస్తున్న వారిని కలుపుకుని ముందుకు సాగేందుకు కమల్‌ సిద్ధమైనట్టున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ నేతృత్వంలో ఆమ్‌ ఆద్మీతో సంప్రదింపుల్లో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే కేజ్రీవాల్‌తో కమల్‌ ఫోన్‌లో సంప్రదింపులు జరిపి నట్టు, గురువారం రాష్ట్రంలోని ఆప్‌ వర్గాలతో మంతనాల్లో నిమగ్నం కావడం గమనార్హం.
చదవండి: బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు..   
కట్‌మనీ సంస్కృతిని అంతం చేస్తాం

 

మరిన్ని వార్తలు