నిరూపిస్తే.. ఉరేసుకుంటా: బండి సంజయ్‌

31 Oct, 2020 19:44 IST|Sakshi

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్‌

సాక్షి, సిద్దిపేట : తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వలేదన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తిప్పికొట్టారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో బిజెపి ప్రభుత్వాన్ని బెదిరించడం సరికాదన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా శనివారం ఆయన రాయపోల్ మండలం పలు గ్రామాలలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. తెలంగాణకు కేంద్రం నిధుల విడుదలపై చర్చకు రావాలంటూ సీఎం కేసీఆర్‌కు ప్రతి సవాల్‌ విసిరారు. ఒకవేళ నిధులు విడుదల చేయలేదని నిరూపిస్తే దుబ్బాక చౌరస్తాలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటానని కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
(చదవండి : నిరూపిస్తే.. రాజీనామా చేస్తా : సీఎం కేసీఆర్‌)

అంతకుముందు బీజేపీ నాయ‌కుల‌పై సీఎం కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెన్షన్ల విషయంలో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం కేవలం మనిషికి రూ.200 చొప్పున మాత్రమే పింఛన్లు అందిస్తే.. బీజేపీ నేతలు మాత్రం రూ.1600 చొప్పున ఇస్తోందని అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ల విషయంలో తాను చెప్పేది అబద్దమని నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని బీజేపీ నేతలకు కేసీఆర్‌ సవాల్‌ విసిరారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు