దుబ్బాక ఉప ఎన్నికపై ఈసీ స్పెషల్‌ ఫోకస్‌

28 Oct, 2020 16:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దుబ్బాక ఉప ఎన్నికపై ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక దృష్టి పెట్టింది. రాజకీయ నేతల ఫిర్యాదుతో ఈ ఎన్నికలకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించింది. శాంతి భద్రతల పరిశీలకుడిగా తమిళనాడుకు చెందిన ఐపీఎస్‌ అధికారి సరోజ్‌ కుమార్‌ నియమితులయ్యారు. కాగా దుబ్బాక ఉప ఎన్నిక రాజకీయం జోరందుకున్నది. బీజేపీ వర్సెస్ అధికార పార్టీ టిఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్టుగా ఓట్లు రాబట్టేందుకు ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రచారం కొనసాగిస్తున్నాయి.

దీంతో దుబ్బాక నియోజకవర్గంలో ఉప పోరు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్ర నేతలంతా దుబ్బాకలో మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నిక జరగనుండగా, 10న ఓట్ల లెక్కింపు, విజేతను ప్రకటిస్తారు.
(చదవండి : ఉపఎన్నిక.. ‘దుబ్బాక’ కాక)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు