హుజురాబాద్‌లో గన్‌ కలకలం.. నాకేం జరిగినా కేసీఆర్‌దే బాధ్యత: ఈటల షాకింగ్‌ కామెంట్స్‌

18 Sep, 2022 11:58 IST|Sakshi

సాక్షి, హుజురాబాద్‌: బీజేపీ హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఓ నాయకుడి వద్ద గన్‌ కనిపించడం కలకలం రేపింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, బహిరంగ కార్యక్రమంలో ఇలా గన్‌తో పాల్గొనడం వివాదాస్పదంగా మారింది.

అయితే, దీనికి సంబంధించిన వీడియోపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో గన్‌ లైసెన్స్‌లు విచ్చలవిడిగా ఇస్తున్నారు. నాకు, నా కుటుంబ సభ్యులకు ఏం జరిగినా సీఎం కేసీఆర్‌దే బాధ్యత. మా రక్తం బొట్టు చిందినా సీఎందే పూర్తి బాధ్యత. ఇటువంటి బెదిరింపులకు భయపడేది లేదు. నాపై నయిమ్‌ గ్యాంగ్‌ రెక్కీ నిర్వహించినప్పుడే భయపడలేదన్నారు. 

ఇక, గన్‌ లైసెన్స్‌లపై కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ సత్యనారాయణ స్పందించారు. ఈ క్రమంలో సీపీ మాట్లాడుతూ.. గడిచిన రెండేళ్లలో హుజురాబాద్‌లో కేవలం ఇద్దరికి మాత్రమే గన్‌ లెసెన్స్ ఇచ్చినట్టు తెలిపారు. ఈ మధ్య కాలంలో ఒక్కరూ కూడా గన్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తున చేసుకోలేదని స్పష్టం చేశారు. ఇక, గన్‌తో కనిపించిన నేతను సైతం పోలీసులు స్టేషన్‌కు పిలిపించుకుని మరోసారి ఇలా జరిగితే లైసెన్స్‌ రద్దు చేస్తామని వార్నింగ్‌ ఇచ్చినట్టు సమాచారం. 

మరిన్ని వార్తలు