మునుగోడు మాజీ ఆర్వో సస్పెన్షన్‌.. తెలంగాణ సర్కార్‌కు ఈసీ కీలక ఆదేశాలు

28 Oct, 2022 12:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కేఎంవీ జగన్నాథరావును తక్ష ణమే సస్పెండ్‌ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. శుక్రవారం ఉదయం 11గంటల్లోగా సస్పెన్షన్‌ ఉత్తర్వులను పంపాలని రాష్ట్ర ప్రభుత్వా న్ని కోరింది. రిటర్నింగ్‌ అధికారికి సరైన భద్రత కల్పించడంలో విఫలమైనందుకు గానూ స్థానిక డీఎస్పీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది.

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో యుగ తులసి పార్టీ అభ్యర్థికి కేటా యించిన రోడ్డు రోలర్‌ గుర్తును మార్చి  బేబీ వాకర్‌ గుర్తును కేటాయించడా న్ని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల తీవ్రంగా పరిగణించిన విషయం తెలి సిందే. ఈ వ్యవహారంలో బాధ్యుడైన రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో) జగన్నాథ రావుపై వేటు వేసి ఆస్థానంలో మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్‌ను ఆర్వో గా నియమించింది. యుగ తులసి పార్టీ అభ్యర్థికి తిరిగి రోడ్డు రోలర్‌ను కేటాయించింది. తాజాగా ఈ ఉదంతంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన అనంతరం జగన్నాథరావును సస్పెండ్‌ చేయాలని నిర్ణయించింది.
(చదవండి: ఉచితాలతో ఓటర్లను ఆధారపడేలా చేయొద్దు)

మునుగోడు ఉపఎన్నికను రద్దు చేయండి 
భారత ఎన్నికల చరిత్రలోనే అతి ఖరీదైన ఎన్నిక మును గోడు ఉపఎన్నిక అని, అక్కడ జరుగుతున్న అక్రమాలు, డబ్బు, మద్యం పంపిణీని అరికట్టి ఉపఎన్నికను రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు గోనెల ప్రకాశ్‌రావు వినతి పత్రాలు పంపారు. మునుగోడులో అక్టోబర్‌ నెలలో దాదాపు రూ.132 కోట్ల మద్యం ఏరులైపారిందని, టీఆర్‌ఎస్‌ పార్టీ, బీజేపీ మునుగోడులో ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని వివరించారు. భారత రాజ్యాంగంలోని ఆరి్టకల్‌ 324 ప్రకారం ఎన్నికల రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘంకు ఉందని గుర్తు చేశారు.
(చదవండి: మునుగోడు సైన్మా.. టక్కర్లు, ట్విస్ట్‌లు)

మరిన్ని వార్తలు