బద్వేలులో ఊపందుకున్న ప్రచారం

20 Oct, 2021 05:17 IST|Sakshi
ఆత్మీయ సదస్సులో ప్రసంగిస్తున్న మంత్రి సురేష్‌. వేదికపై సజ్జల, మంత్రులు తదితరులు

పోరుమామిళ్లలో వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సదస్సు

పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

సాక్షి, కడప: వైఎస్సార్‌ జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. వైఎస్సార్‌సీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నేతలు ప్రచారం చేస్తున్నారు. పోరుమామిళ్ల మండలం రంగసముద్రంలో మంగళవారం వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధ, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, వరప్రసాద్, సంజీవయ్య, ముస్తఫా, ద్వారకనాథరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ మాణిక్యవర›ప్రసాద్, కడప మేయర్‌ సురేష్‌బాబు, గుంటూరు జెడ్పీ చైర్‌పర్సన్‌ క్రిస్టినా, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర నాయకులు చల్లా మధుసూదన్‌రెడ్డి, నవీన్‌ నిశ్చల్, పులి సునీల్‌కుమార్, పలువురు కార్పొరేషన్‌ చైర్మన్లు పాల్గొన్నారు.

ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. బి.కోడూరు మండలంలో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కలసపాడులో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, పార్టీ అభ్యర్థి డాక్టర్‌ సుధ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పోరుమామిళ్లలో ఎమ్మెల్యే జంగాలపల్లె శ్రీనివాసులు, ఎమ్మెల్సీ రామచంద్రయ్య, అనంతపురం నేత మహాలక్ష్మి శ్రీనివాస్, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ శేషు, అడా చైర్మన్‌ గురుమోహన్‌ ప్రచారం చేశారు. కాశినాయన మండలంలో మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం కొనసాగింది. డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజాద్‌బాషా, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కమలాపురం, రాజంపేట ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి కార్యకర్తలతో మాట్లాడుతూ భారీ మెజార్టీ కోసం కృషిచేస్తున్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌ నేతల ప్రచారం
అట్లూరు మండలంలోని కొండూరు, అట్లూరు గ్రామాల్లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవిరెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనాథ్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. కలసపాడు, పోరుమామిళ్ల, అట్లూరు మండలాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పి.కమలమ్మ, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ప్రచారం చేశారు.  

మరిన్ని వార్తలు