బై ఎలక్షన్లలో బీజేపీకి షాక్‌

17 Apr, 2022 04:52 IST|Sakshi

మొత్తం ఐదు స్థానాల్లోనూ ఓటమి

కోల్‌కతా/కొల్హాపూర్‌: దేశవ్యాప్తంగా శనివారం వెల్లడైన ఒక లోక్‌సభ, 4 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి షాకిచ్చాయి. అన్ని చోట్లా పార్టీ ఓటమి చవిచూసింది. పశ్చిమబెంగాల్‌లో అసన్‌సోల్‌ లోక్‌సభ, బాలీగుంగే అసెంబ్లీ సీట్లను అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది.

అసన్‌సోల్‌లో టీఎంసీ అభ్యర్థి, ప్రముఖ సినీనటుడు ‘షాట్‌గన్‌’ శత్రుఘ్న సిన్హా బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్‌పై ఏకంగా 3,03,209 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. బీజేపీ నుంచి ఇటీవలే తృణమూల్‌లో చేరిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్‌ సుప్రియో బాలీగుంగేలో 20,228 ఓట్ల మెజారిటీతో గెలిచారు. బీజేపీ కేవలం 13,220 ఓట్లతో సరిపెట్టుకుంది.మహారాష్ట్రలో కొల్హాపూర్‌ నార్త్, చత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్‌ అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్, బిహార్‌లో బొచాహన్‌ అసెంబ్లీ స్థానాన్ని ఆర్జేడీ దక్కించుకున్నాయి.  
 

మరిన్ని వార్తలు