మంత్రినైపోయా.. లేకుంటే కొట్టేవాడిని

8 Sep, 2023 02:05 IST|Sakshi
ఎర్రబెల్లి దయాకర్‌రావు

ఎర్రబెల్లి వివాదాస్పద వ్యాఖ్యలు

సంగెం: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్‌ జిల్లా సంగెం మండలంలో బుధవారం కాంగ్రెస్‌ నేతలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన మాట్లాడిన మాటలు గురువారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. గవిచర్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ప్రతిపక్షాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌ నేతలు దుర్మార్గపు అబద్ధపు మాటలు చెబుతుంటే.. ఈడ్చి కొట్టాలని ఉన్నా.. మంత్రి పదవి అడ్డు వస్తోందని పేర్కొన్నారు. తనకు టీడీపీని వీడాలని లేదని.. చంద్రబాబు ఇక్కడ దుకాణం ఎత్తివేసి ఆంధ్రాకు వెళ్లడంతో.. ఇక్కడ పార్టీని ఎంత లేపాలని చూసినా లేవదు కాబట్టి.. కార్యకర్తలను కాపాడుకోవడానికే బీఆర్‌ఎస్‌లో చేరానని స్పష్టం చేశారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలు గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి.    
 

మరిన్ని వార్తలు