ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’విహీనం..!

7 Sep, 2021 07:07 IST|Sakshi

సస్పెన్షన్‌కు భయపడని కలిశెట్టి

డోంట్‌కేర్‌ అంటూ ముందుకెళ్తున్న వైనం

కళా నాయకత్వాన్ని వద్దంటున్న ఎచ్చెర్ల టీడీపీ శ్రేణులు 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’ విహీనమవుతోంది. ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షు డు కళా వెంకటరావు నాయకత్వాన్ని అక్కడి టీడీ పీ శ్రేణులు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నాయి. తన మాట మాత్రమే వినాలనే కళా వైఖరిని ఎండగడుతున్నాయి. తనతో కలిసి పనిచేయకపోతే లోకేష్‌ను తీసుకువచ్చి పోటీ చేయిస్తానని కళా బెదిరిస్తుంటే.. మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు ఇక్కడేం చేయగలరని బాహాటంగానే బదులిస్తున్నాయి. దీంతో కళా వెంకటరావు పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది.

ఇప్పటికే ఆయనను కాదని బయటకు వచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు స్వతంత్రంగా పనులు చేయడం మొదలుపెట్టారు. ఆ నియోజకవర్గంలో కళాకు ప్రత్యామ్నాయంగా మారుతున్నారు. అసంతృప్త నేతలు, కార్యకర్తలంతా ఇప్పుడు కలిశెట్టితో కలుస్తున్నారు. కలిశెట్టి నాయకత్వ పటిమను పక్కన పెడితే.. కళా కంటే మేలేనని కా ర్యకర్తలు భావిస్తున్నారు. కలిశెట్టిని పార్టీ నుంచి రెండుసార్లు సస్పెండ్‌ చేయిస్తే డోంట్‌కేర్‌ అంటూ పార్టీ జెండాతోనే కార్యక్రమాలు చేపడుతున్నారు.

బుజ్జగింపు.. బెదిరింపు 
పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతుండడంతో కళా అండ్‌కో పార్టీ శ్రేణులను దారికి తెచ్చుకు నే ప్రయత్నం చేస్తోంది. కలిశెట్టి వెనుక తిరుగుతున్న వారిని బుజ్జగించే పనిలో ఉంది. కలిశెట్టికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్‌ రాదని తమతోనే పనిచేయాలని కళా కోరుతున్నారు. అయితే ఈ రా య‘బేరాలకు’ ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ శ్రేణు లు తలొగ్గడం లేదు. కళా నాయకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఫోన్‌ లోనే నేరుగా చెప్పేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి వస్తున్న స్పందనతో అవాక్కవుతు న్న కళా అండ్‌కో చివరికి బెదిరింపులకు దిగుతున్నారు.

కళా పోటీలో లేకుంటే ఆయన కుమారు డు పోటీ చేస్తాడని, కాదూ కూడదంటే లోకేష్‌ను తీసుకువచ్చి పోటీ చేయిస్తారని కేడర్‌కు బెదిరింపుల సంకేతాలు పంపిస్తున్నారు. కానీ ఆ బెదిరింపులకు కూడా ఎవరూ లొంగడం లేదు.  లోకేష్‌ ఇ క్కడికొస్తే అవమానం తప్ప ఏమీ ఉండదని, స్థా నికుడే నాయకుడిగా ఉండాలని «ధీటుగా జవాబు ఇచ్చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఎచ్చెర్లలో బయట నుంచి ఏ నాయకుడొచ్చి నాయకత్వం వహించినా టీడీపీ శ్రేణులు తరిమికొట్టేలా ఉన్నాయి.

ఇవీ చదవండి:
‘రోడ్డు’ మ్యాప్‌ రెడీ    
కోటి రూపాయలను తలదన్నే కథ 

మరిన్ని వార్తలు