కేసీఆర్‌ అహంకారాన్ని బొందపెడతారు: ఈటల 

12 Sep, 2021 03:37 IST|Sakshi
బీసీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతున్న ఈటల. చిత్రంలో ఆర్‌.కృష్ణయ్య 

ముషీరాబాద్‌: హుజూరాబాద్‌ ఉపఎన్నిక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అహంకారానికి తన ధర్మానికి మధ్య నడుస్తున్న పోటీ అని హుజూరాబాద్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు కా లగర్భంలో కలసిపోతారని జోస్యం చెప్పారు. విద్యానగర్‌లోని బీసీభవన్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అ«ధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్యను శనివారం కలసిన అనంతరం ఈటల విలేకరులతో మాట్లాడారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో రూ.వందల కోట్లు ఖర్చుపెట్టి, అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలవాలని అనుకుంటున్నారని, అయితే అక్కడి ప్రజలు చైతన్యవంతులని, కేసీఆర్‌ అహంకారాన్ని బొం దపెడతారని చెప్పారు. అనంతరం ఆర్‌.కృష్ణయ్య మాట్లాడారు. కార్యక్రమంలో బీసీ సంక్షే మ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, సూర్యారావు, ఉదయ్‌నేత పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు