వరంగల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌?.. వరుస భేటీలతో ఈటల బిజీబిజీ

18 Aug, 2022 21:15 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లుపై బిజేపి ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ వైపు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్ర సాగుతుంటే..  మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఈటల రాజేందర్ బిజీగా ఉన్నారు. వరంగల్‌లో పార్టీలో చేరికలపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో భేటీ అయ్యారు.

ప్రదీప్ రావు ఇంట్లో జరిగిన ఈ భేటీలో ఈటలతోపాటు వరంగల్, హనుమకొండ జిల్లాల బీజేపీ అధ్యక్షులు కొండేటి శ్రీధర్ రావు, పద్మ.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి ఉన్నారు. కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీసీ కుల సంఘాలకు చెందిన పలువురు నాయకులతో కూడా ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ప్రదీప్ రావుతో పాటు ఎవరెవరు బీజేపీలో చేరుతున్నారనే అంశంపై చర్చించి, చేరికలపై ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలిసింది.

కాగా, బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత ముగింపు ఈ నెల 27న భద్రకాళి అమ్మవారి పాదాల చెంతన ముగుస్తుండడంతో ఆ రోజున నిర్వహించే బహిరంగ సభలో ప్రదీప్ రావుతో పాటు టీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు ముఖ్య నాయకులు పార్టీలో చేరేలా పగడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. 

చదవండి: (సోనియాగాంధీ వద్దకు కోమటిరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి!)

మరిన్ని వార్తలు