కేసీఆర్‌ ఉద్యమ ద్రోహులకు పట్టం కడుతున్నారు: ఈటల

5 Aug, 2021 11:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రి నుంచి మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌ గురువారం డిశ్చార్జ్‌ అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లు విసిరిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు హుజురాబాద్‌ ప్రజల కంటే వారి ఓట్లమీదనే ప్రేమ ఎక్కువని మండిపడ్డారు. ఇప్పటికే 150 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అన్నారు. కేసీఆర్‌ ఉద్యమ ద్రోహులకు పట్టం కడుతున్నాడని దుయ్యబట్టారు. గతంలో ఇచ్చిన అనేక హామీలను ఇప్పుడు అమలు చేస్తున్నారని అన్నారు.

కేసీఆర్‌ ఎప్పుడైనా ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారా. కేసీఆర్‌ ఎప్పుడు, ఎవరికి పట్టం కడతారో ప్రజలు అర్థం చేసుకోవాలి. గతంలో నన్ను బొంద పెట్టాలని చూసిన వారిని ఇప్పుడు ఆదరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ. దళితులకు మూడెకరాల భూమి హామీ ఇచ్చి ఇంకా నెరవేర్చలేదు.’ అని ఈటల రాజేందర్‌ కేసీఆర్‌పై ఫైర్‌ అయ్యారు.

మరిన్ని వార్తలు