టీఆర్‌ఎస్‌ నేతలే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు:ఈటల

3 Oct, 2021 17:28 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదల పక్షాన జీవితాంతం అండగా ఉంటాని తెలిపారు. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తు నకిలీ లేఖలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు.

టీఆర్‌ఎస్‌ వాళ్లే ఏమైనా కుట్ర పన్ని తనపై దాడి చేస్తున్నారా? అనే అనుమానం వస్తోందని అన్నారు. టీఆర్‌ఎస్‌ కుట్రలకు హుజురాబాద్‌ ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు.

మరిన్ని వార్తలు