‘రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారో తెలుసా బాబు?!’

27 Oct, 2021 15:28 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ‘‘ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు రాష్ట్రపతిని కోరడం హాస్యాస్పదంగా ఉంది. అసలు రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారో చంద్రబాబుకు తెలుసా. చంద్రబాబు గురించి తెలుసు కాబట్టి మోదీ, అమిత్ షా అపాయింట్ కూడా ఇవ్వలేదు’’ అని ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయబాబు అన్నారు. 

ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాసివ్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రపంచంలో చాలా సందర్భాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి’’ అని తెలిపారు.
(చదవండి: ఢిల్లీలో చంద్రబాబుకు షాక్‌.. అపాయింట్‌మెంట్‌ ఇవ్వని మోదీ, షా)

‘‘పట్టాభి వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించి ఉంటే బావుండేది. గతంలో చంద్రబాబు ప్రధాని మోదీకి నిరసన స్వాగతం పలికారు. అమిత్ షా కుటుంబతో సహా తిరుమలకు వస్తే దాడులు చేయించారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీని వ్యతిరేకిస్తూ దీక్షలు చేశారు. ఇప్పుడు మళ్లీ బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడాలని చంద్రబాబు భావిస్తున్నారు’’ అని విజయ్‌ బాబు తెలిపారు. 

చదవండి: పట్టాభి తీరు సమర్థనీయం కాదు.. పా‍ర్టీలకతీతంగా ఖండించాలి

మరిన్ని వార్తలు