ఐసీయూలో యూపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రధాని మోదీ ఆరా

5 Jul, 2021 13:34 IST|Sakshi

సాక్షి,లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్‌ (89) అస్వస్థతకు లోనయ్యారు. ఆయనను లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఆదివారం చేర్పించారు. ఇంటెన్సివ్ కేర్ విభాగంలో  చికిత్స అందిస్తున్నారు. నెఫ్రాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, ఎండోక్రినాలజీ , న్యూరో ఓటోలజీ విభాగాల నిపుణుల బృందాన్ని ఆయన ఆరోగ్యాన్ని పర‍్యవేక్షిస్తోంది. 

కల్యాణ్‌సింగ్‌ త్వరగా కోలుకోవాలని ఆ రాముణ్ని ప్రార్థిస్తున్నానంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ట్వీట్‌ చేశారు. మరోవైపు కల్యాణ్‌ సింగ్‌ ఆరోగ్యపరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఆయన కుమారుడు రాజ్‌వీర్‌కు ఫోన్ చేసి, వివరాలను తెలుసుకున్నారు. అలాగే ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా సీఎం యోగీని  కోరారు.  అంతకుముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్,  కేశవ్ ప్రసాద్ మౌర్య, యూపీ బీజేపీ చీఫ్ స్వాత్రా దేవ్ సింగ్ ఆసుపత్రిని సందర్శించిన కల్యాణ్‌ సింగ్‌ను పరామర్శించారు. కాగా రాజస్థాన్ గవర్నర్‌గా కూడా కల్యాణ్‌ సింగ్‌ పనిచేశారు.

మరిన్ని వార్తలు