కేసీఆర్‌ కలిసినట్లు స్రవంతి ఫేక్‌ వీడియో.. స్పందించిన కాంగ్రెస్‌ అభ్యర్థి

3 Nov, 2022 11:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు పోలింగ్‌ వేళ ప్రత్యర్థులపై పార్టీలు ఫేక్‌ ప్రచారానికి తెరలేపాయి. నిన్నటి నుంచి అన్ని పార్టీల మీద ఫేక్‌ వీడియోలు ప్రచారంలోకి వచ్చాయి. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మండిపడ్డారు. ఫేక్‌ న్యూస్‌పై ఈసీకి ఫిర్యాదు చేశానని ఆమె పేర్కొన్నారు. మార్ఫింగ్‌ ఫొటోతో సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసున్నారని తెలిపారు. దుష్ప్రచారం చేసినవారికి నోటీసులు పంపిస్తానని స్రవంతి తెలిపారు. పాల్వాయి స్రవంతి సీఎం కేసీఆర్‌ను కేసీఆర్‌ను కలిశారంటూ నకిలీ వీడియో ప్రచారం అయ్యింది.
చదవండి: పోతరాజు అవతారమెత్తిన రాహుల్‌.. కొరడాతో విన్యాసం

మరిన్ని వార్తలు