విజయనగరం టీడీపీలో ఫ్లెక్సీ వార్‌.. అశోక్ గజపతి రాజుపై ధిక్కార స్వరం

17 Aug, 2022 16:44 IST|Sakshi

సాక్షి, విజయనగరం: విజయనగరం టీడీపీలో విభేదాలు మదిరిపాకాన పడ్డాయి. మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుపై బీసీ మహిళా, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత గత కొద్ది రోజుల క్రితం ధిక్కార స్వరం వినిపించారు. బీసీలు ఎక్కువగా ఉన్న విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీలకే టికెట్ ఇవ్వాలన్నది ఆమె డిమాండ్. ఈ నేపథ్యంలో అశోక్ గజపతి రాజు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆమె డుమ్మా కొడుతున్నారు. నేరుగా చంద్రబాబుతోనే అమె టచ్‌లో ఉంటున్నారు.
చదవండి: ‘చంద్ర’గ్రహణం వీడుతున్న కుప్పం

మరోపక్క నియోజకవర్గంలో అశోక్ గజపతి రాజును వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో బీసీలు లక్షా అరవైవేల మంది ఉన్నారంటూ, రాజ్యాధికారం బీసీలకే ఇవ్వండంటూ బీసీ ఐక్యవేదిక పేరుతో ఫ్లెక్సీలు విజయనగరం పట్టణంలో కీలక ప్రాంతాల్లో వెలిశాయి. అయితే ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే ఇది మీసాల గీత వర్గీయుల పనే అంటూ అశోక్ గజపతి వర్గం కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టింది.

మరిన్ని వార్తలు