టీఎంసీ గూటికి కాంగ్రెస్‌ మాజీ ఎంపీ సుస్మితా దేవ్‌

16 Aug, 2021 17:58 IST|Sakshi

కోలకతా: అంచనాలకనుగుణంగానే టీఎంసీ గూటికి మాజీ ఎంపీ సుస్మితా దేవ్‌ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ సుస్మితా దేవ్ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సుస్మితా దేవ్‌ టీఎంసీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, డెరిక్ ఒబ్రెయిన్ సమక్షంలో సోమవారం టీఎంసీ కండువా కప్పుకున్నారు.  ఈ మేరకు సుస్మితాతో పాటు,  టీఎంసీ ట్విటర్‌  ఖాతాల ద్వారా ఈ  విషయాన్ని ధృవీకరించారు.

తన శక్తి సామర్థ్యాలను  సంపూర్తిగా కేటాయిస్తానంటే ట్విట్‌  చేసిన సుస్మిత పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు ఖేలా హోబ్‌ హ్యాష్ ట్యాగ్‌ను కూడా యాడ్‌ చేశారు.

కాగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి సుస్మితా దేవ్ లేఖ రాశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్టు లేఖ‌లో పేర్కొన్నారు. పార్టీతో మూడు దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఆమె ఈ సందర్భంగా,  కాంగ్రెస్‌ పార్టీ  నేతలు, సభ్యులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఎందుకు పార్టీని వీడుతున్నదీ ఆమె వెల్లడించలేదు. ప్రజా సేవలో మరో నూతన అధ్యాయం అని మాత్రమే వెల్లడించారు. ఈ లేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయినప్పటికీ, ఈ వార్తలను కాంగ్రెస్‌ ఖండించింది. మరోవైపు ఇదే నిజమైతే చాలా దురదృష్టకరమంటూ  కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తలు