హామీల అమలుపై ఆత్మపరిశీలన చేసుకోండి

31 Jan, 2023 01:58 IST|Sakshi
ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి  

బీఆర్‌ఎస్‌ నేతలకు పొంగులేటి హితవు

బోనకల్‌: బీఆర్‌ఎస్‌ నేతలు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఎంతమేరకు అమలు చేశారో ఆత్మపరిశీలన చేసుకోవాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన మధిర నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చిన తాను, ఖమ్మం జిల్లా ప్రజల అభిమానంతో ఎంపీగా గెలి చానని చెప్పారు.

రాష్ట్ర విభజన తర్వాత స్థానిక పరిస్థితుల దృష్ట్యా సీఎం కేసీఆర్, కేటీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం ఆనాడు టీఆర్‌ఎస్‌లో చేరాన న్నా రు. అయితే, కేసీఆర్, కేటీఆర్‌ ఏ ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేదని, ఏడున్నరేళ్ల పాటు తాను అనేక అవమానాలను ఎదుర్కొన్నా నని తెలి పారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యు త్, రైతులకు రుణమాఫీ వంటి వాగ్దానాలను పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని దుయ్యబట్టారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కలగానే మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాభిమానం పొందలేక ఓడిపోయిన అభ్యర్థులందరినీ తానే ఓడించాననే అపనింద మోపి ఎంపీ టికెట్‌ ఇవ్వలేదన్నారు. అయినప్పటికీ పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేశానని పొంగులేటి తెలిపారు. జిలాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ కార్యకలాపాలకు సహకారం అందించానన్నారు. 

మరిన్ని వార్తలు