టీడీపీకి మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి రాజీనామా

18 Jul, 2021 07:51 IST|Sakshi

సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): టీడీపీ సీనియర్‌ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి ఆ పార్టీకి రాజీనామా చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన ఆమె తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపుతానని శనివారం మీడియాకు చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. అధికారం కోల్పోయాక పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని, పార్టీలో ఎదిగేందుకు అవకాశంలేదని ఆమె కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉన్నారు. పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీల్లో తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే.. పార్టీకి రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే.. 1999లో ఎస్‌.కోట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి తొలి ప్రయత్నంలోనే ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థి కుంభా రవిబాబు చేతిలో ఓటమి చెందారు. 2009లో సామాజిక సమీకరణల్లో ఎస్‌.కోట అసెంబ్లీ సీటును ఆమె త్యాగం చేశారు. అప్పటి నుంచి పార్టీకి సేవలు అందిస్తూ వచ్చారు. 2014లో హైమావతి కుమార్తె స్వాతిరాణి విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2019లో ఎన్నికల తర్వాత స్వాతిరాణి వైఎస్సార్‌సీపీలో చేరారు.

పార్టీ వైఖరి నచ్చక రాజీనామాలు 
కాగా, టీడీపీకి ఇలా పలువురు ముఖ్య నేతలు ఇప్పటికే రాజీనామా చేశారు. కొద్దిరోజుల క్రితం గుంటూరు జిల్లాకు చెందిన దాసరి రాజా మాస్టారు పార్టీకి గుడ్‌బై చెప్పారు. అలాగే, మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేసిన జియావుద్దీన్‌ కూడా అసంతృప్తితోనే పార్టీని వీడారు. అంతకుముందు.. పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అనేకమంది పార్టీ వైఖరి నచ్చక రాజీనామా చేశారు. మరి 

మరిన్ని వార్తలు