బీజేపీకి షాకిచ్చిన మాజీ కేంద్రమంత్రి

17 Nov, 2020 16:40 IST|Sakshi

పార్టీని అభివృద్ధి చేస్తానంటే అవకాశం ఇవ్వడం లేదు : జైసింగ్‌రావ్ గైక్వాడ్ పాటిల్

 బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు జైసింగ్‌రావ్ గైక్వాడ్ పాటిల్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఆయన  మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్‌కు ఆయన మంగళవారం  ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో పార్టీ అభివృద్ది కోసం పనిచేసే వారు బీజేపీకి అవసరం లేదంటూ విమర‍్శలు గుప్పించారు.

సీనియర్‌ నాయకుడిగా పార్టీకోసం పనిచేయడానికి సిద్దంగా ఉన్నా, తనకు అవకాశం కల్పించడంలేదని తన రాజీనామా లేఖలో ఆయన ఆరోపించారు. అందువల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని  వెల్లడించారు. గతంలో తాను  కేంద్రంతో పాటు రాష్ట్రంలో మంత్రిగా పనిచేశానని చెప్పారు. ఎంపీగానో, ఎంఎల్‌ఏగానో  ఉండాలని లేదు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని భావించాను, గత పదేళ్లుగా అలాంటి బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నాను. అయినా తనకు పార్టీ అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు.  మరోవైపు ఈ విషయంపై స్పందించడానికి చంద్రకాంత్ పాటిల్‌ నిరాకరించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు