విభజన హామీలు నెరవేర్చమంటే ఎదురు దాడేంటి?

27 Oct, 2021 05:07 IST|Sakshi

సోము వీర్రాజుపై ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట  ధ్వజం 

బద్వేలు అర్బన్‌: విభజన చట్టంలో పొందుపర్చిన ప్రత్యేక హోదా, దుగరాజపట్నం పోర్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ వంటి అంశాలను నెరవేర్చమని అడిగితే.. వాటికి సమాధానం చెప్పకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎదురు దాడికి దిగి వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ జిల్లా బద్వేలులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే మేరుగ నాగార్జునతో కలిసి మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

విభజన చట్టంలో పొందుపర్చిన అం శాలను నెరవేరిస్తే బీజేపీకి మద్దతు ఇస్తామని, లేనిపక్షంలో క్షమాపణ చెప్పాలని అడిగిన తనకు బీజేపీ నేతల నుంచి సమాధానం వస్తుందని ఆశించానని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. దీనికి సమాధానం చెప్పకుండా  వీర్రాజు ఎదురు దాడి చేస్తూ తనపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారన్నారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు,నాగార్జున మాట్లాడారు. 

>
మరిన్ని వార్తలు