చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు.. అందుకే ఇలా: గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

13 May, 2022 12:09 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: చంద్రబాబు దిగజారి ఉన్మాద భాష మాట్లాడుతున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. కుప్పం పర్యటనలో జనం లేకపోవడంతో చంద్రబాబుకు ఫ్రస్ట్రేషన్‌లోకి వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు. తన తాబేదార్లకు మించి దిగజారుడు భాషలో ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్దం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం ప్రజలకు అందుతుంటే చంద్రబాబుకు ఆక్రోశం వస్తోందని, గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమన్ని వివరిస్తుంటే తట్టుకోలేక అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కుల, మత, ప్రాంత భేదం లేకుండా అందరికీ సంక్షేమం అందిస్తున్నాం. చంద్రబాబులాగా విడగొట్టి సంక్షేమాన్ని నిర్వీర్యం చేయలేదు. నువ్వు చేయలేనిది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు. నారాయణ సంస్థలు నారాయణవి కాదంటే ప్రజలు విస్తుపోతున్నారు. తప్పు చేస్తున్న వారిని శిక్షిస్తే కక్ష సాధింపు చర్యలు అంటారు. ముఖ్యమంత్రి సమీప బంధువు అయినా కూడా తప్పు చేస్తే శిక్ష పడింది. నీ హయాంలో తప్పు జరిగిన వారిని వెనకేసుకొచ్చి రాజీ పంచాయితీలు చేశావు.

గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం ఎంతో అద్భుమైనది. చంద్రబాబు ఏడుసార్లు కుప్పం నుంచి గెలిచినా సమస్యలు తీర్చలేదు. కుప్పం నియోజకవర్గాన్ని  సీఎం జగన్ అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. హంగు ఆర్భాటం లేకుండా ప్రజల్లోకి వెళ్లి మంచి చేయాలన్నదే సీఎం జగన్‌ ఆలోచన’ అని శ్రీకాంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు