అభివృద్ధి అజెండాగా సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన: గడికోట శ్రీకాంత్‌రెడ్డి

4 Jan, 2022 17:41 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: అభివృద్ధి అజెండాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన సాగిందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో చర్చించారు. అయితేవాస్తవాలకు దూరంగా పరిపాలన సాగించిన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు వాస్తవాలు చెబుతుంటే సహించలేకపోతున్నారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు.

ఈ మేరకు ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు గ్రాఫిక్స్‌తో కాలం గడిపారు. రాజధాని కోసం చంద్రబాబు చేసిందేమీ లేదు. అక్కడ రూ.10వేల కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు.. లెక్క చెప్పగలరా?. అమరావతిలో చంద్రబాబు సొంతిల్లు కూడా కట్టుకోలేదు. వాస్తవాలకు దూరంగా చంద్రబాబు పాలనసాగింది. రాజధాని పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. వందల కోట్ల చందాలతో న్యాయస్థానం టు దేవస్థానం యాత్ర నిర్వహించారు' అని శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. 

చదవండి: (టీడీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు)

మరిన్ని వార్తలు