ఫ్యాక్షన్ ఉంటేనే టీడీపీకి మనుగడ: శ్రీకాంత్‌ రెడ్డి

30 Jan, 2021 20:51 IST|Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు హుంకరింపులకు భయపడేవారు ఎవరూ లేరని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. 2001లో ఏకగ్రీవాలపై జీవో విడుదల చేసిందే చంద్రబాబేనని ఆయన అన్నారు. శనివారం శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీ కోటనే గడగడలాడించిన వ్యక్తి అడుగు జాడల్లో నడుస్తున్న పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనని వ్యాఖ్యానించారు. పార్టీలకతీతంగా జరిగే ఎన్నికల్లో గ్రామాల్లో కక్ష్యలు, కారుణ్యాలు ఉండకుడదనే ఉద్యేశ్యంతో పోత్సహకాలు ప్రకటిస్తే హేళన చేస్తారా అని చంద్రబాబును నిలదీశారు. నిమ్మగడ్డ రాయలసీమ పర్యటన రాజకీయ పర్యటనను తలపించిందని విమర్శించారు. 20 నెలల నుంచి ఎన్నికల అధికారిగా కాకుండా టీడీపీ ప్రతినిధిలా వ్యవహరించారని మండిపడ్డారు. చదవండి: రాష్ట్రపతి చిత్తూరు జిల్లా పర్యటన ఖరారు

నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌కు 11 సంవత్సరాల తర్వాత దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గుర్తొచ్చారని శ్రీకాంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆధారాలతో సహ రాజకీయా నాయకులతో మంతనాలు జరిపింది రాష్ట్ర ప్రజలు చూశారని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్‌గా ఆయన నిర్వర్తించే విధులను పూర్తిగా గౌరవిస్తామని, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వంపై నిందలు వేయడమే నిమ్మగడ్డ పనిలా అనిపిస్తుందన్నారు. మహనేత వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న నాయకులకు టికెట్లు ఇవ్వద్దంటే చంద్రబాబు వెనకడుగు వేశాడని, ఫ్యాక్షన్ ఉంటేనే టీడీపీకి మనుగడ ఉంటుందని అన్నారు. చంద్రబాబు వ్యవస్థలను ఏవిధంగా వాడుకుంటారో అందరికి తెలుసని, ఆయన అధికారంలో ఉన్నప్పుడే వైఎస్సార్సీపీ 86 శాతం సీట్లు దక్కించుకుందని ప్రస్తావించారు. చదవండి: టీడీపీకి ఎన్నికల కమిషన్‌ నోటీసులు

రమేశ్‌ కుమార్‌లా కాకుండా ఎలక్షన్ కమిషనర్‌గా వ్యవహరించాలని హితవు పలికారు. చంద్రబాబు, అతని అనుచరుల ప్రోద్భలంతో ప్రయివేట్ యాప్ పేట్టుకున్నారని, టీడీపీ హయాంలో జరిగిన దౌర్జన్యాలను గుర్తుచేసుకోవాలని సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో హత్యలు, మహిళలపై దాడులు, అడపిల్లలపై వేధింపులు చేసి ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అయిన వేంటనే మా వాళ్లు తప్పు చేస్తే చూసి చూడనట్లు వ్యవహరించండి అని ఐపీఎస్, ఐఏఎస్‌లకు చెప్పిన నీచ చరిత్ర చంద్రబాబుదని దుయ్యబట్టారు. మంచి చేసిన నాయకుడిని ప్రజలు ఏ విధంగా ఆభిమానిస్తున్నారో ప్రజల్లోకి వచ్చి చూడాని కోరారు. ఆలయాలను కూల్చి ఆ నిందలను వైఎస్సార్సీపీపై మోపారని మండిపడ్డారు. ప్రజలకు ఏ సమస్య లేదన్న శ్రీకాంత్‌ రెడ్డి ప్రజలు సంతోషంగా ఉన్నారని, రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలన సాగుతోందని పేర్కొన్నారు.
చదవండి: ‘మదనపల్లి దంపతుల్లాగే సత్యలోకంలో చంద్రబాబు’

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు