టీఆర్ఎస్ మ్యానిఫెస్టో.. కొత్త సీసాలో పాత సారా

23 Nov, 2020 17:07 IST|Sakshi

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు హైదరాబాద్ ప్రజల చెవుల్లో క్యాలిఫ్లవర్స్ పెడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎద్దేవా చేశారు. సోమవారం ఆమె బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. ఒకరు కొట్టినట్లు.. ఇంకొకరు ఏడ్చినట్లు చేస్తున్నారని వ్యగ్యాస్త్రాలు సంధించారు. ఎంఐఎం నేతలు హిందువులను హేళన చేసినప్పుడు కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ఆమె పశ్నించారు. (చదవండి: జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. టీఆర్‌ఎస్‌ వరాల జల్లు)

‘‘ఎంఐఎంకు మేయర్ సీటు అప్పగించడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. వంద సీట్లు వస్తాయన్న కేసీఆర్... ఇప్పుడు 25 సీట్లు గెలిచినా.. మేయర్ సీటు టీఆర్ఎస్‌దే అంటున్నారు. ఎంఐఎం.. పాతబస్తీని ఎందుకు అభివృద్ధి చేయలేదు. డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎందుకు ఇవ్వలేదు. కొత్త సీసాలో పాత సారా అన్నట్టుగా టీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఉంది. అభివృద్ధి చేస్తే వరద నీరు ఇళ్లలోకి ఎలా వచ్చింది ?. తెలంగాణ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. నా పార్టీ.. నా నగరం... నా పాలన .. అనే నినాదం టీఆర్ఎస్‌కు సరిగ్గా సరిపోతుంది. వగల ముచ్చట్లు చెప్పి 2016లో గెలిచారు. టీఆర్ఎస్‌కు ఓటు వేస్తే... ఒక కుటుంబానికి వేసినట్లే. హైటెక్ షో పీస్‌లా కేటీఆర్‌ మారిపోయారని’’ డీకే అరుణ ఎద్దేవా చేశారు. (చదవండి: టీఆర్‌ఎస్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు