ఎంఐఎంని వెనక్కి నెట్టిన కమలం..!

4 Dec, 2020 20:47 IST|Sakshi

రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ

సాక్షి, హైదరాబాద్‌: బల్దియా ఎన్నికల ఫలితాలు ముగింపుకు చేరుకున్నాయి. మరొక డివిజన్‌లో ఫలితం వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌-56, బీజేపీ-48, ఎంఐఎం-44, కాంగ్రెస్‌-2 స్థానాల్లో విజయం సాధించింది. ఇక గత ఎన్నికల్లో పోలీస్తే.. ఈ ఫలితాలు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి, పతంగి పార్టీకి షాక్‌ ఇచ్చాయి. గతంలో టీఆర్‌ఎస్‌ మేజిక్‌ ఫిగర్‌ని సాధించగా.. ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి అతి పెద్ద రెండో పార్టీగా నిలిచింది. ఇక ఈ సారి బల్డియా పోరులో ఫలితాలు తారుమారయ్యాయి. గ్రేటర్‌ ఓటర్‌ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు.

ఇక గత ఎన్నికల్లో 44 స్థానాలు సాధించిన ఎంఐంఎ ఈ సారి 43 మాత్రమే సాధించింది. ఇక గతంలో 4స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈ సారి ఏకంగా 48 స్థానాల్లో విజయం సాధించి.. రెండో అతి పెద్ద పార్టీగా నిలిచి.. ఎంఐఎంని వెనక్కి నెట్టింది. కానీ పాత బస్తీలో మాత్రం పాగా వేయలేకపోయింది. అమిత్‌ షా భాగ్యలక్ష్మీ ఆలయం సందర్శించినప్పటికి పెద్దగా ఫలితం లేకపోయింది. ఇక ఇప్పటికి పాతబస్తీలో తమకు తిరుగు లేదని పతంగి పార్టీ మరోసారి రుజువు చేసుకుంది. ఈ సారి ఎంఐఎం మూడో స్థానానికి పరిమితమయ్యింది. అయినప్పటికి మేయర్‌ ఎన్నికల్లో ఎంఐంఎ కీలక పాత్ర పోషించనుంది. (చదవండి: హంగ్‌ దిశగా.. గ్రేటర్‌ జడ్జిమెంట్)

మరిన్ని వార్తలు