ఏఎస్‌రావు నగర్‌, ఉప్పల్‌లో కాంగ్రెస్‌ గెలుపు

4 Dec, 2020 16:33 IST|Sakshi

సా​క్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎట్టకేలకు రెండు డివిజన్లలో విజయం సాధించింది. ఏఎస్‌ రావు నగర్‌, ఉప్పల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు. అయితే వీరిద్దరూ మహిళా అభ్యర్థులే కావడం విశేషం. ఏఎస్‌ రావు నగర్‌ నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన సింగిరెడ్డి శిరీషా రెడ్డి, ఉప్పల్‌ (10వ డివిజన్) నుంచి మందముల్లా రజిత 5912 ఓట్లతో గెలుపొందారు. కాగా గ్రేటర్‌ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీని హైదరాబాద్‌ ఓటర్లు మరోసారి తిరస్కరించారనే చెప్పవచ్చు. ( జీహెచ్‌ఎంసీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు )

ఇప్పటి వరకూ వెల్లడైన ఫలితాల ప్రకారం.. హస్తం పార్టీ కనీసం ప్రభావం చూపలేకపోయింది. ఇక దుబ్బాక విజయంతో ఒక్కసారే రేసులోకి వచ్చిన బీజేపీ.. కాంగ్రెస్‌ ఓట్లకు భారీగా గండికొట్టినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాషాయదళం భారీగా ఓటింగ్‌ శాతాన్ని పెంచుకుంది. 

నేను చేసిన అభివృద్ధే గెలిపించింది: రజిత
ప్రజా సంక్షేమం కోసం తాను చేపట్టిన అభివృద్ధి పనులే తనను గెలిపించాయని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మందముల్లా రజిత అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీలు మారతానన్న మాటలు అవాస్తవం అని స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు