ఎగ్జిట్‌ పోల్స్‌లో టీఆర్‌ఎస్‌కే మొగ్గు

3 Dec, 2020 18:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాయి. ఇప‍్పటివరకూ వచ్చిన ఎగ్జిట్‌పోల్స్‌లో అధికారి పార్టీదే హవా. గతంలో కంటే సీట్లు తగ్గుతున్నా.. టీఆర్‌ఎస్‌ సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఓట్ల శాతం మెరుగ్గా ఉన్నా సీట్లలో బీజేపీ వెనకబడే ఛాన్స్‌ ఉంది. ఇక మజ్లిస్‌ పార్టీ 40 కంటే ఎక్కువ సీట్లలో గెలవనుంది. 

కాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు స్వల్ప ఆధిక్యత లభించే అవకాశం ఉంది. ‘పీపుల్స్‌ పల్స్‌’ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే ఫలితాల ప్రకారం.. టీఆర్‌ఎస్‌కు 68-78 స్థానాలు, బీజేపీకి 25-35, ఎంఐఎంకు 38-42 స్థానాలు, కాంగ్రెస్‌కు 1-5 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. టీఆర్‌ఎస్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ (76)కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం టీఆర్‌ఎస్‌, బీజేపీకి మధ్య 6 శాతం ఓట్ల వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో సైలెంట్‌ వేవ్‌ కన్పిస్తోంది. ఈ వేవ్‌ పనిచేస్తే బీజేపీ మరింత లాభపడే అవకాశం ఉంది.

  • ఆరా సర్వేలో టీఆర్‌ఎస్‌కు సొంతంగా అధికారం (78)
  • పీపుల్స్‌ పల్స్‌ సర్వేలో బీజేపీకి టీఆర్‌ఎస్‌కు 68 నుంచి 78
  • సీపీఎస్‌సర్వేలో టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ (82 నుంచి 96)
  • ఆత్మసాక్షి సర్వేలో టీఆర్‌ఎస్‌కు భారీ సీట్లు (82 నుంచి 88)
  • వెల్లడైన అన్ని సర్వేల్లోనూ టాప్‌గా కనిపిస్తోన్న టీఆర్‌ఎస్‌
  • శాంతి భద్రతల అంశంలో టీఆర్‌ఎస్‌కు మార్కులు
  • టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపిన మహిళలు, వృద్ధులు
  • కరోనా విషయంలో 57%పైగా టీఆర్‌ఎస్‌కు అనుకూలం
  • వరద సాయం విషయంలో 51% టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకం
  • డబుల్‌ బెడ్‌రూం అంశంలో 39% టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకం
  • డ్రైనేజీ వ్యవస్థ, రహదారులపై 44% టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకం
  • బీజేపీకి అనుకూలంగా యువత, నిరుద్యోగులు
  • పాతబస్తీలో పట్టు కొనసాగించిన మజ్లిస్‌ పార్టీ
  • 12 నుంచి 14 సీట్లలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ

మరిన్ని వార్తలు